Friday, April 10, 2009

ఫుణ్యం కొద్ది ప్రొజెక్టు, దానం కొద్ది కొలీగులు( అందమయిన అమ్మాయిలు)

ఎగిరే యె ఎగిరే పైకెగిరె
కలలే యె అలలై
పైకెగిరె


దోస్త్: ఏంట్రా చాలా ఆనందం గా ఉన్నావ్..జీతం పెరిగిందా?
నేను: లేదు....ఇంకా ఎక్కువ
దోస్త్: ఒహో ఏకం గా ప్రొమొషన్ వచ్చిందా?
నేను: లేదు రా ప్రొజెక్ట్ నుండి రిలీస్ వచ్చింది.
దోస్త్: దానికి అంత ఆనందం ఎంట్రా?
నేను: ఆరెయ్ బాలయ్య సినిమా చూసినా బతికి బయట పడటం
మా ప్రొజెక్ట్ నుండి బయటకు రావడం
ఎంతొ అద్రుష్టం ఉంటె కాని జరగదు ఇలాంటి విడ్డూరం

ఛాలా కస్ట పడితె దొరికింది నాకు ఈ రిలీజ్. నెక్ష్ట్ ప్రొజక్ట్ కి కెనడా వెల్తావా అని మా మేనేజర్ అడిగారు. కెనడా అనగానె కేక పెట్టి మరీ వెల్తాను అనుకున్నారు. కాని నేను ఆలొచించి చెప్తాను అన్నాను.
అయ్యగారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా...... మనం ఆలోచించే వరకు ప్రోజక్ట్ ఉంటుందా
నేను ఒకె అనెలొగా ఒకడు అప్పటికే విమానం ఎక్కి కుర్చున్నాడు

దోస్త్: నెక్ష్ట్ ఎంట్రా
నేను: P.G ప్రొజక్ట్ వాల్లు రమ్మని పిలుస్తున్నారు రా….వెల్లకపొతే ఫీల్ అవుతారు కదా
దోస్త్: చా
నేను: నిజం రా వాల్లతొ నా సంభాషణ ఎలా అయ్యిందొ చెప్తా విను

P.G: మా ప్రోజక్ట్ లొ టీం లీడ్ రోల్ ఉంది….ఆ రోల్ నీకు కర్రెక్ట్ గా సరిపొతుంది….
నేను: అంత మంచి ప్రోజక్ట్ అంద్ మంచి రోల్ నాకేనా?
P.G: నాకద్దు….ఆ రోల్ నీకే
నేను: బట్ వై మి?
P.G: గ్రేటాధి గ్రేటుడు…స్టారాధి స్తారుడు…వీరాధి వీరుడు సత్తిగాడు
నేను: అధి నిజమే కాని…..నేను హైదరబాద్ నుండే పని చెయ్యగలను
P.G: మీ ఇంటి నుండి చేసినా పర్లేదు….పని చెయ్యక పొయినా పర్లేదు
దోస్త్: అల్లరి నరేష్ లొ ఆది కేశవరెడ్డి ని చూసాడు రా మీ వాడు

ఛిరంజీవి సినిమాకి 1స్ట్ డే టికెట్లు
ట్రైన్ లొ మన పక్క సీట్ లో అందమయిన అమ్మాయిలు
మన లాంటి వాల్లకి ఇలాంటి ప్రొజక్ట్లు ఎప్పుడో కాని దొరకవ్….సొ ఎలాగయినా ఈ ఆపర్ట్యూనిటి చెయ్యజార్చుకొకు


మా దోస్త్ చెప్పినట్టు ఎక్కడ చెయ్య జార్చుకుంటానొ అని చేతులు రెండూ బిగ పెట్టుకొని కుర్చొని పని చెయ్యాలా వద్దా అని డీప్ గా ఆలొచిస్తుంటే ఎవరొ మెస్సెంజర్ లొ నన్ను యాడ్ చెసుకున్నారు……అనిల్ అంట
ఫ్లీస్ కాల్ మి అని నంబర్ పంపాడు…. నాకు ఎమీ అర్దం కాలేదు. ఆ నంబర్ కి కాల్ చేస్తే తిస్ ఈస్ నందీష….నైస్ టు హియర్ ఫ్రం యు సత్యా అన్నాడు….
నాకు ఏమి అర్దం కాలేదు…..అసలే చిన్నప్పటి నుండి సస్పెన్స్ సినిమా మొత్తం చూసాక కూడా విలన్ ఎవరో అర్దం అయ్యేది కాదు….. సింగపూర్ లొ ప్రొజచ్ట్ ఉంది…..వెల్తే నీ అద్రుష్టం…వెల్లకపొతే నీకే నష్టం… ఇప్పుడు సినిమా మొదట్లోనే నా లైఫ్ లొ విలన్ ఎవరో అర్దం అయిపొయింది…… నువ్వు ఈ ప్రొజక్ట్ తేసుకోకపోతే (“రెఫ్యూసల్ ఆఫ్ వర్క్ అవుతుంది” ) నువ్వు పని చెయ్యను అంటున్నావ్ అని చెప్తాను అని బెధిరించాడు.(ఇప్పటివరకు ఎప్పుడయినా చేసానా పని….కొత్తగ చెప్పడానికి….. )

తాటాకు చప్పుల్లకు సిం హం బెధురునా…
విలన్ బెధిరింపులకు చిరంజీవి లొంగునా….

మా మేనేజర్ దగ్గరకి వెల్లాను….
నేను: ఎవరో నందీష అంట…..కొత్త గా పని గురుండి మాట్లడుతున్నడు…..ఇలాంటి ఆచారం మన కంపనీ లో ఉందా…..ఎవరయినా పని చెస్తార ఇక్కడ….మీరు చెసార ఎప్పుడయినా పని
మా మేనేజర్: కంగారు పడుతూ.... నేను ఎప్పుడు పని చెసాను…నేను ఏమి చెయ్యలెదు. నేను ఎంటి నా బాస్స్ కూడ ఎప్పుడూ పని చెయ్యలేదు.
నేను: నాకు P.G ప్రొజక్ట్ కావాలి ……అది మేరే ఇవ్వాలి
మేనేజర్: మా బాస్ ప్రనవ్ తో మాట్లాడు….అతను హెల్ప్ చెస్తాడు
నేను: అంటే మీరు చెయ్యరా?


ఫ్రనవ్ కి మైల్ పెట్టాను….నాకు పి.జి కావాలి అన్నాను….పర్మిషన్ ఇవ్వమని కొరాను…అథను 10 పజీల కొషన్ పేపర్ కి సింగిల్ లైన్ ఆన్సర్ రాసినట్టు నందీష తొ మాట్లడి సింగపూర్ కి వెల్లు అన్నాడు….
నా బుర్ర గిర్ర మని తిరిగింది…..భూమీ గుండ్రం గా ఉంటుంది అని మా సొషల్ టీచర్ చెప్తే అప్పుడు నమ్మలేదు…..ఇప్పుడు నమ్మక తప్పలేదు.
డైరక్ట్ గా మాట్లాడదాం ప్రనవ్ తొ అని డీసైడ్ అయ్యిపొయా…చాలా ట్రై చేసా అతని తొ మాత్లాడడానికి……
ఛిక్కడు …దొరకడు…..
పిలిస్తే పారిపోతాడు……దగ్గరకి వెల్తే దాంకుంటాడు
నాతొ చెడుగుడు అడుకున్నాడు


భూమి చుట్టూ తిరిగే చంద్రుడి లా…
సొనియా చుట్టూ తిరిగే వై.స్.ర్. లా….
మా సోషల్ మేడం చుట్టూ తిరిగే లెక్కల మాస్టార్లా…
ప్రనవ్ చుట్టూ తిరిగాను…. నన్ను తప్పించుకోలేక ……నా బద బరించలెక….ఫైనల్ గా నాకు కాల్ చేసాడు.
"నిన్ను విడిచి నేను ఉండలేను లె…అది నిజము లె….నువ్వు లేని ప్రొజక్ట్ లేదు లె అది లెదు లె……"
నిన్ను మేము వదల లేము…..అయినా ఇక్కడ నీకు ఏమి కావాలో చెప్పు….. PM కావాలన…GM కావాలన….DM కావాలన…
నాకు పి.జి ప్రొజక్ట్ కావాలి….అందులో ఉన్న మంచి రోల్ కావాలి…
గ్రోత్ కావాలి…మంచి కెరీర్ కావాలి…
ఆ ఒక్కటే అడగకు అన్నాడు.....ఫొన్ పెట్టేసి పారిపోయాడు

నాకు ఏమి చెయ్యాలో తోచలెదు….చాలా డల్ గా అయ్యిపోయాను….
రాత్రి ఇంటి దగ్గర నిధ్ర పట్టదు…
ఉదయం ఆఫీస్ లో మెలుకువ రాదు..
ఈ దిగులుతో ఎంత తింటున్నానో ఎమి తింటున్నానొ తెలియకుండా తినేసాను…బాగా బలిసాను.


నా కండీషన్ చూసి కంగారు పడి నాన్నగారు కాల్ చెసారు
నాన్నగారు: ఈ చిన్న విషయానికి దిగులు పడతావ్ ఎంట్రా…..వాల్లు ఇచేది తేసుకో…నచేటట్టు చేసుకో
నెను: లెదు నేను అనుకున్నది సాదిస్తా…అప్పటిదాకా ఫైట్ చెస్తా
నాన్నగారు: తెగేదాక లాగవద్దు….అతిగా సాగ వద్దు
ఈ లోగా మా ఫ్రేండ్ కాల్ చేసాడు పరామర్సించడానికి

దోస్త్: ఏరా నీ ప్రొజక్ట్ గోల ఎంత వరకు వచింది
ణెను: పెనం లోనుండి పొయ్యలోకి పడినట్టు ఉంది
దోస్త్: మరి ఎంటి ఇంక ద్రాప్ న…చాలా రోజుల నుండి సాగుతున్నట్టు ఉంది
ణెను : శ్వాస ఉండేవరకు ఆశ ఉంతుంది.
దోస్త్: మరి సాగ దీస్తే చెయ్య కాలుతుంది
ప్రనవ్ వాల్ల బాస్, రాజేష్ తొ మాట్లాడదాం అని డెచైడ్ అయ్యాను. రాజేష్ కి కాల్ చేసాను….ఇతను దైర్యవంతుడు….వెంటనే కాల్ పిక్ చేసి నాతొ మాట్లాడాడు.

నేను: నీ రాజ్యం లొ అన్యాయమా….ఇది నీకు భావ్యమా….నేను ఎమయినా ఎలక్షన్ లొ పార్తి టికట్ అడిగానా….H1B లేకుండా US పంపమన్నానా…..ఎదో నాకు కావలసిన PG ప్రొజక్ట్ కావాలి అన్నాను
రాజేష్ : కాని ఆ ప్రొజక్ట్ బాగుంటుంది అని ఎవరు చెప్పారు
నేను: ఎవరో చెప్తే నేను ఎందుకు నమ్ముతాను….P.G వాల్లే చెప్పారు
రాజేష్ : ఆ ఒక్కటే అడగకు…నీకు కావాలంతే నా పోస్ట్ ఇమ్మన్నా ఇస్తాను… నువ్వు హైదరాబాద్ లో ఒక ప్రొజక్ట్ ఉంది అందులో జాయిన్ అవ్వు….మంచి ప్రొజక్ట్
నేను: అందులొ పని ఎలా ఉంటుంది?
రాజేష్ : తినే ముందు రుచి అడుగకు, వినే ముందు కథ అడుగకు, ప్రొజక్ట్ లోకి రాకుండా పని ఏంటో అడగకు
నేను :చా ఇంకా నయం పని చేసి జీతం అడుగకు అనలేదు
రాజేష్ : వెంకటేష్ తొ మాట్లాడు ఆ ప్రొజక్ట్ PM తను డీటైల్స్ ఇస్తాడు. PM తో మాట్లాడితేనె కదా తెలుస్తుంది ప్రొజక్ట్ మంచిదో కాదో


రాజేష్ మాటని గౌరవించి……నిజం చెప్పలంటే ఇంకా ఏమి చెయ్యలేను అని చింతించి…..
వెంకటేష్ తొ ఆ ప్రొజక్ట్ గురుండి చర్చించాను….
నేర్చుకోడానికి చాల ఉంది అని గ్రహించాను…..
ప్రొజక్త్ బాగనె ఉంది అని సంత్రుప్తి చెందాను.
ఆ ప్రొజక్ట్ పేరు హే బేబి….అయ్యో రామ కాదు కాదు ABB.
ఆవి అండి ప్రొజక్ట్ కోసం నేను పడిన పాట్లు గ్రహ పాట్లు…..ప్రొజక్ట్ కోసం ఇంత కష్ట పదాల అంటారా…
పుణ్యం కొద్ది ప్రొజక్టు, దానం కొద్ధి కొలీగులు( అందమయిన అమ్మయిలు) మరీ


PS: ఈ లోగా తెలిసింది ఏంటి అంటే…కేనడా ప్రొజక్ట్ ఆగిపోతుంది అని….ఇప్పట్లో స్టార్ట్ అవ్వకపోవచు అని………
అది తీసుకోలేదు అని ఒకప్పుడు చాలా బాద పడ్డాను….
కాని అన్నీ మన మంచికే జరుగుతాయి అన్న సత్యం మల్లీ గ్రహించాను….
మనకి ఎమి కావాలొ మన కంటే ఆ భఘవంతునికి ఇంకా బాగా తెలుసు అని తెలుసుకున్నను…..

3 comments:

Sri said...

Era Post Rayamantey...Pusthakam Rasestava...

Chala bagundi...Prasa adirindi mama....Tataku cheppulaki Simham bedaradu kani...nuvvu matram mee PM gadiki bayapadali mama.

swasa vundey varaku aasa vuntundaaa...alagey NACHINADANI KANNA VACHINADANITHO HAPPY feel avvali ra....

Hey baby.....keka ra..kani nee kastalani kannillani evaru ardam chesukuntaru mama :)

Unknown said...

mava keka too much r thr.....
train lo andamayina ammayalu chiranjeevi ticket lu....too much...

pani cheyyadam gurindi matladutunnadu enti para kooda too much.....

rockin mavs....every post seems to be better than the earlier one...!!

Unknown said...

chaala bagundi...Simply Superb.....
nee praasa tho kummesav...
"పని చేసి జీతం అడుగకు అనలేదు...."
"పుణ్యం కొద్ది ప్రొజక్టు, దానం కొద్ధి కొలీగులు( అందమయిన అమ్మయిలు)"

ela rasukuntuu..pothe malli nee blog antha rayalemoooo...


chala bagundii...